Header Banner

ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..! అకౌంట్‌లోకి డబ్బులు!

  Fri May 16, 2025 17:13        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం 2 పథకం కింద ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను అందజేస్తోంది. ఇప్పటికే మొదటి సిలిండర్‌కు సంబంధించిన రాయితీ డబ్బుల్ని లబ్ధిదారుల అకౌంట్‌లలో జమ చేయగా.. రెండో సిలిండర్ డబ్బుల్ని కూడా విడుదల చేస్తున్నారు. అయితే చాలా మందికి రెండో విడత గ్యాస్ రాయితీ డబ్బులు రాలేదని ఫిర్యాదు చేస్తున్నారు. మొదటి విడతలో డబ్బులు త్వరగా వచ్చాయి.. కానీ రెండో విడతలో ఆలస్యం అవుతోందంటున్నారు. సాంకేతిక సమస్యల వల్ల నిధులు విడుదల చేయడంలో ఆలస్యమైందని.. త్వరలోనే డబ్బులు బ్యాంకు అకౌంట్‌లలో జమ చేస్తారని అధికారులు తెలిపారు. మొదటి విడతలో డబ్బులు పొందిన వారందరికీ రెండో విడతలో కూడా వస్తాయని.. ఎవరూ కంగారు పడొద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఈ మేరకు దీపం పథకం గ్యాస్ సిలిండర్ల రాయితీకి సంబంధించి కొంతమంది రేషన్ కార్డు వివరాలు ఆన్‌లైన్‌లో చెక్ చేయగా.. వారికి వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉన్న ఇల్లు ఉండడం వల్ల.. అలాగే 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు రావడం వల్ల రాయితీకి అనర్హులైనట్లు తేలిందట. మరికొందరు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోవడం వల్ల డబ్బులు జమ కాలేదంటున్నారు. ఈ మేరకు ఈకేవైసీ పూర్తి చేసేందుకు గ్యాస్ డీలర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు అధికారులు. సాంకేతిక ఇబ్బందులతోనే నిధుల విడుదలలో కాస్త ఆలస్యమైందని.. వారం రోజుల వ్యవధిలోనే బ్యాంకు ఖాతాలకు నిధులు జమ అవుతాయంటున్నారు. ఈకేవైసీతో పాటుగా బ్యాంకు అకౌంట్‌లకు ఆధార్ లింక్ కాకపోవడంతో కొందరికి గతంలో డబ్బులు జమకాలేదు.. దీనిని కూడా చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.. వీటన్నిటిని సరిచేసుకుంటే బ్యాంక్ అకౌంట్‌లలో డబ్బులు జమ అవుతాయంటున్నారు.

మరోవైపు ఏపీ ప్రభుత్వం దీపం పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దీపం పథకం కింద డబ్బుల చెల్లింపు చేయాలని.. లబ్ధిదారుల ఖాతాల్లో సిలిండర్ బుకింగ్ కంటే ముందే నగదు చెల్లించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. 'ఏడాదిలో 3 సిలిండర్ల నగదును ఒకేసారి చెల్లించాలని.. లబ్ధిదారులు సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నా సరే సిలిండర్‌ తీసుకోకపోయినా 3 సిలిండర్ల నగదు ఒకేసారి వారి ఖాతాల్లో జమ చేయాలని' నిర్ణయించారు. మరోవైపు ప్రతి నెలా సంక్షేమం అందేలా ఏడాదికి సరిపడా సంక్షేమ క్యాలెండర్ విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ 12న ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు ఫించన్లు కూడా అందించనున్నారు. జూన్ 12న ఎన్నికల హామీలైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ప్రారంభించాలని నిర్ణయించారు. అంతేకాదు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు నెలల్లో ప్రారంభిస్తామంటున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఈ 'ఓసీ' కులం పేరు మార్పు.. కొత్తగా పేరు ఏంటంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలోని వారందరికీ గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు! మంత్రి కీలక ప్రకటన!

 

 తల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

 

 ఎస్సీ, ఎస్టీ కేసులో సజ్జల భార్గవ్‌కు షాక్‌..! వారిదే తప్పు.. సుప్రీం కోర్టు తేల్చేసింది..!



మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #FreeGasSubsidy #LPGSubsidy #GasCylinderMoney #SubsidyUpdate #AccountCredit #SimpleSteps #GasScheme